News February 7, 2025

సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలి: WGL ట్రాఫిక్ ఏసీపీ

image

ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ ట్రాఫిక్ నియంత్రణ చేయాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. గురువారం ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ అధికారులతో సమావేశయ్యారు. ఈ సమావేశంలో అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్, జరిమానాలు విధించే సమయం, ట్రాఫిక్ నియంత్రణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏసీపీ అధికారులకు సూచించారు.

Similar News

News April 19, 2026

GWL: ఈనెల 20న రైతు నేస్తం కార్యక్రమం: DAO

image

ఈనెల 20న మధ్యాహ్నం 3:00 తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. భూసార పరీక్షల ప్రాముఖ్యం, రైతుల సమగ్ర సమాచారం, డిజిటల్ గుర్తింపు, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియపై రైతులకు వివరిస్తామన్నారు. ఆధునిక వ్యవసాయంపై శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు చేస్తారని చెప్పారు.

News April 19, 2026

సాగర్‌కు పూర్వవైభవం.. పూడిక తీతకు గ్రీన్ సిగ్నల్

image

నాగార్జునసాగర్ జలాశయంలో పేరుకుపోయిన పూడిక తొలగింపునకు అడుగులు పడ్డాయి. సుమారు 115 టీఎంసీల మేర పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు రూ.44,000 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు కేంద్ర జలవనరుల శాఖ నుంచి పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా జలాశయ నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు సాగునీటి సరఫరా మరింత మెరుగుపడనుంది.

News April 19, 2026

వేసవి తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదివారం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు. వడదెబ్బ నివారణకు కాటన్ దుస్తులు ధరించాలని, దాహం లేకపోయినా తరచుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ వంటి ద్రవాలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదన్నారు.