News January 29, 2025

సమన్వయంతో విధులు నిర్వహించాలి: సీపీ అనురాధ

image

పోలీస్ అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సిద్దిపేట వన్ టౌన్, మహిళా పోలీస్ స్టేషన్, టాస్క్ ఫోర్స్ కార్యాలయాలను సీపీ సందర్శించారు. స్టేషన్ పరిసర ప్రాంతాలు, సీజ్ చేసిన వాహనాలు పరిశీలించారు. మొక్కలు నాటారు. ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించి మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News November 18, 2025

నిర్మల్‌లో కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం

image

నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఈ భవనాన్ని రూ.8.10 కోట్లతో, 5.38 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు తెలిపారు. పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, రావుల రాంనాథ్ తదితరులు పాల్గొన్నారు.

News November 18, 2025

వరంగల్: చేపల పెంపకంలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

చేపల పెంపకంలో శిక్షణ పొందడానికి ఆసక్తి ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు. 18నుంచి 30 ఏళ్ల వయసు గల 7వతరగతి చదివిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 26లోగా 7వ తరగతి, కులం, బదిలీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో దరఖాస్తులను జిల్లా మత్స్యశాఖ అధికారి, పెద్దమ్మ గడ్డ, ములుగు రోడ్డు, హనుమకొండ, PIN:506007 చిరునామాకు పంపాలన్నారు.

News November 18, 2025

ప్రకాశం ఎస్పీ మీకోసంకు 130 ఫిర్యాదులు.!

image

ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులు వారి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తంగా 130 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.