News January 29, 2025
సమన్వయంతో విధులు నిర్వహించాలి: సీపీ అనురాధ

పోలీస్ అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సిద్దిపేట వన్ టౌన్, మహిళా పోలీస్ స్టేషన్, టాస్క్ ఫోర్స్ కార్యాలయాలను సీపీ సందర్శించారు. స్టేషన్ పరిసర ప్రాంతాలు, సీజ్ చేసిన వాహనాలు పరిశీలించారు. మొక్కలు నాటారు. ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించి మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News February 11, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు: అదనపు కలెక్టర్

పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు.మంగళవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో మెదక్, నిజామాబాద్ అదిలాబాద్ , కరీంనగర్ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన పిఓలు, ఏపిఓలు, సెక్టార్, నోడల్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
News February 11, 2025
హైదరాబాద్‌లో రూ.20 లక్షల విలువైన విదేశీ సిగరేట్స్ సీజ్..

హైదరాబాద్‌లో విదేశీ సిగరెట్ల గుట్టును కమిషనర్ టాస్క్‌ఫోర్స్, సౌత్ వెస్ట్ జోన్, హాబీబ్ నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో రట్టు చేశారు. రూ.20 లక్షల విలువైన విదేశీ సిగరేట్స్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అఫ్సల్ నగర్, అగపురా రోడ్డులో ఓ గోదాంలో విదేశీ సిగరేట్స్ నిల్వ ఉంచారు. ఈ మేరకు నిందితులు ఇమ్రాన్, ఆయుబ్‌ను అరెస్ట్ చేశారు.
News February 11, 2025
PM ఫ్రాన్స్ పర్యటనలో చేసుకునే రక్షణ ఒప్పందాలివే

ఫ్రాన్స్‌నుంచి 26 రఫేల్-ఎం యుద్ధవిమానాలు, 3 స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్లను నేవీ కోసం కొనుగోలు చేయాలని భారత్ సూచనప్రాయంగా నిర్ణయించింది. ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో ఈ ఒప్పందం పూర్తికానుంది. ఫైటర్ జెట్స్ ఒప్పందం విలువ రూ.63వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా. INS విక్రాంత్, INS విక్రమాదిత్య నౌకలపై వీటిని మోహరించనున్నారు. ఇక 3 సబ్‌మెరైన్ల కొనుగోలు విలువ రూ.33,500 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.