News February 25, 2025

సమన్వయకర్తలుగా పంచకర్ల, వంశీకృష్ణ యాదవ్

image

మార్చి 14వ తేదిన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు విశాఖ పార్లమెంట్‌కు సంబందించి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్‌ను నియమించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ ను అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. వీరు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి వేడుకలు విజయవంతానికి కృషి చేయాలి.

Similar News

News March 15, 2025

విశాఖలో 17 మంది పోలీసులకు బదిలీ

image

విశాఖ కమీషనరేట్ పరిధిలో 17 మంది సివిల్ పోలీస్ సిబ్బందిని శనివారం విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి బదిలీలు చేశారు. వీరిలో ఒక ఏఎస్ఐ, 8 మంది హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఆరుగురు పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ జరిగిన పోలీస్ స్టేషన్‌లలో తక్షణమే విధులలో చేరాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

News March 15, 2025

విశాఖ జూలో వరుస మరణాలు..!

image

విశాఖ జూపార్క్‌లో వన్యప్రాణుల వరుస మరణాలు జంతు ప్రేమికులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే గతంలో అరుదైన జత జిరాఫీలు, ఒక జీబ్రా, నీటి ఏనుగు మృత్యువాత పడ్డాయి. తాజాగా కొన్ని రోజుల క్రితం ఆసియాటిక్ లయన్‌కు పుట్టిన రెండు సింహపు కూనలు ప్రాణాలు విడిచాయి. గురువారం అనారోగ్యంతో 20 ఏళ్ల చిరుత పులి ప్రాణాలు విడిచింది. ప్రభుత్వం,అధికారులు దృష్టి పెట్టి వన్యప్రాణులను కాపాడాలని సందర్శకులు కోరుతున్నారు.

News March 15, 2025

విశాఖలో జూన్ 1నుంచి జరిమానా

image

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు స్వస్తి పలుకుదామని ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా ప్రత్యేకాధికారి కాటమనేని భాస్కర్ అన్నారు. శనివారం విశాఖ ఆర్‌కె బీచ్ వద్ద స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జనవరి 1నుంచి ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చెప్పినా అక్కడక్కడ కనిపిస్తూన్నాయన్నారు. జూన్ 1నుంచి సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగదారులకు జరిమానాలు విధిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.

error: Content is protected !!