News August 25, 2024
సమభావంతో స్వీకరిస్తూ, స్థితప్రజ్ఞతతో ముందుకు సాగాలి: మంత్రి సురేఖ
జీవన గమనంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ద్వాపరయుగమైనా, కలియుగమైనా, సర్వకాలాల్లోనూ శ్రీకృష్ణుడు చూపిన బాట సదా ఆచరణీయమని మంత్రి చెప్పారు.
Similar News
News September 13, 2024
అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: ఎమ్మెల్సీ
MHBD: బీఆర్ఎస్ ముఖ్య నేతల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రశ్నించే వారిపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం కొట్లాడుతూనే ఉంటామన్నారు.
News September 13, 2024
ఒడిశా రాష్ట్రం గంజాంలో సమావేశం నిర్వహించిన హుస్సేన్ నాయక్
MHBD: ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో షెడ్యూల్డ్ తెగల కోసం రాజ్యాంగపరమైన రక్షణలు, సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు, మహబూబాబాద్ జిల్లా వాసి జాటోత్ హుస్సేన్ నాయక్ సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు అంకితభావంతో పని చేయాలని హుస్సేన్ నాయక్ పిలుపునిచ్చారు.
News September 13, 2024
వరంగల్: ఎట్టకేలకు భారీగా పెరిగిన పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పత్తి ధర ఊరటనిచ్చింది. గత నాలుగు నెలలుగా మార్కెట్లో ఎన్నడూ లేనివిధంగా ఈరోజు పత్తి అధిక ధర పలికింది. మార్కెట్‌లో సోమ, మంగళవారాలలో క్వింటా పత్తి ధర రూ.7,700 పలకగా బుధవారం రూ.7,800, గురువారం రూ.7,790కి చేరింది. కాగా, నేడు రూ.7,940 ధర రికార్డు స్థాయిలో పలికింది.