News November 8, 2024
సమయానికి బస్సులు నడపాలి: ఆర్ఎం
ప్రయాణికుల సౌకర్యార్థం సమయానికి బస్సులు నడపాలని మెదక్ రీజినల్ మేనేజర్ ప్రభు లత అన్నారు. శుక్రవారం ఖేడ్ ఆర్టీసీ డిపోను ఆమె సందర్శించి తనిఖీ చేశారు. డిపో మేనేజర్ మల్లేశం, అసిస్టెంట్ మేనేజర్ నరసింహులతో సమావేశమై డిపో ఆదాయం వివరాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈనెల 13న అరుణాచలం ప్రత్యేక సూపర్ డీలక్స్ బస్సులు నడపాలని DMకు సూచించారు. ఇందులో ఆఫీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Similar News
News December 6, 2024
సంగారెడ్డి: రేపు ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని జూబ్లీ క్లబ్ ఆవరణలోని ఎంఎస్ అకాడమీలో ఉదయం 10 గంటల నుంచి ఎంపికలు జరుగనున్నాయి. జిల్లాలో ఎంపికైన క్రీడాకారులకు 16 న హైదరాబాద్లో జరిగే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాల్సి ఉంటదని చెప్పారు.
News December 6, 2024
సంగారెడ్డి: ఈనెల 12 నుంచి బడి బయట పిల్లల సర్వే
సంగారెడ్డి జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి జనవరి 11 వరకు బడి బయట పిల్లల సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. అనంతరం డిఈవో మాట్లాడుతూ.. జిల్లాలోని సిఆర్పీలు, ఐఈఆర్పీలు, డిఎల్ఎంటిలు, గ్రామాలలో, అవాస ప్రాంతాలలో బడి బయట పిల్లల సర్వే చేయాలని, సర్వేలో గుర్తించిన విద్యార్థుల వివరాలను ప్రభంద పోర్టల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు.
News December 5, 2024
రేవంత్ రెడ్డి నీ పిట్ట బెదిరింపులకు భయపడం: హరీష్ రావు
సీఎం రేవంత్ రెడ్డి నీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వాళ్లం కాదని ఎమ్మెల్యే హరీష్ రావు X వేదికగా మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారు అని మండిపడ్డారు.