News February 16, 2026
సమష్టి కృషితో జిల్లా ప్రగతి: నల్గొండ కలెక్టర్

నల్గొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి 82 వినతులను స్వీకరించారు. కోర్టు కేసులు, కమిషన్లలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. మార్చి నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
Similar News
News March 17, 2026
ప్రచార రథాన్ని ప్రారంభించిన నల్గొండ కలెక్టర్

“ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన” పథకం కింద జిల్లాలో ఎక్కువ మంది లబ్ధిదారులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన “ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన” పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ప్రచార రథాన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన మంగళవారం ప్రారంభించారు.
News March 17, 2026
బత్తాయి మార్కెట్‌ను సిద్ధం చేయాలని నల్గొండ కలెక్టర్ ఆదేశం

రానున్న బత్తాయి సీజన్‌కు ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న బత్తాయి మార్కెట్‌ను సిద్ధం చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన ఛాంబర్‌లో బత్తాయి మార్కెట్‌పై ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బత్తాయి పంట, బత్తాయి వెరైటీలు, ఉత్పత్తి, విస్తీర్ణం, దిగుబడులు, బత్తాయి సాగు చేస్తున్న రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News March 17, 2026
NLG: గ్యాస్ కొరతతో సామాన్యులకు కష్టాలు

నల్గొండ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ధరల పెరుగుదలతో పాటు సరఫరా లోపం కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వంటగదుల్లో గ్యాస్ లేక వంట చేయడం కష్టంగా మారింది. జిల్లాలో సుమారు 6 లక్షల వినియోగదారులున్నారు. ఈ నెల 13న బుక్ చేసిన సిలిండర్లు ఇంకా అందలేదు. ఈ పరిస్థితిపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సరఫరా మెరుగుపరచాలని కోరుతున్నారు.


