News July 31, 2024

సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లతా: పల్లా

image

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం విశాఖ అక్రిడేటెడ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి సమస్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షులు జనార్ధన్ అధ్యక్షుడు, అధ్యక్షుడు రవికాంత్ పాల్గొన్నారు.

Similar News

News December 13, 2024

విశాఖలో యువకుడి మృతిపై స్పందించిన మంత్రి లోకేశ్

image

విశాఖ కలెక్టరేట్ సమీపంలోని అంగడిదిబ్బకు చెందిన నరేంద్ర(21) లోన్‌యాప్ వేధింపులకు బలి అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కలెక్టర్‌ల కాన్ఫిరెన్స్‌లో మంత్రి లోకేశ్ ప్రస్తావించారు. యువకుడి ఫొటోతో పాటు అతని భార్య ఫొటోను మార్ఫింగ్ చేసి బంధువులకు పంపి ఆత్మహత్యకు కారణమయ్యారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరగా క్యాబినెట్ సబ్ కమిటీ ప్రకటించారు. దీనిపై చిట్టా బయటకు తీస్తామని విజిలెన్స్ డీజీ తెలిపారు.

News December 13, 2024

విశాఖ: మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు అరెస్ట్

image

మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రెండో పట్టణ పోలీసులు గురువారం తెలిపారు. పెందుర్తికి చెందిన జయ గంగాధర కృష్ణ, కే రత్నం, కప్పరాడకు చెందిన శ్యామ్ సుందరరావు యువతలు ఫోటోలను దీపక్‌కు అందజేసేవారు. దీపక్ ఫోటోలను వెబ్ సైట్‌లో పెట్టి ఆ యువతులతో వ్యభిచారం చేయించేవాడు. ఇటీవల దీపక్‌ను అరెస్ట్ చేయగా అతనిచ్చిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ తిరుమలరావు తెలిపారు.

News December 13, 2024

విశాఖ: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడు

image

విశాఖలోని చిన్న వాల్తేరుకు చెందిన ఓ బాలికపై యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదయింది. పి.ధణేశ్ గత కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన బాలికను వేధిస్తూ వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్లు CI రమణయ్య తెలిపారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.