News July 22, 2024
సమస్యలను పరిష్కరించే విధంగా కృషి: ఎస్పీ శరత్ చంద్ర పవార్

పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 70 మంది ఆర్జీలతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్తి వివరాలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News October 20, 2025
NLG: అమ్మో ఈ ఆలయాలకు వెళ్లాలంటేనే..

జిల్లాలో ఈజీ మనీ కోసం ట్రాన్స్ జెండర్లు వీరంగం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పలు ఆలయాల వద్ద తిష్ట వేస్తున్న ట్రాన్స్‌జెండర్లు భక్తుల నుంచి అడ్డగోలుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నిడమనూరు(M) కోట మైసమ్మ, కనగల్(M) దర్వేశిపురం ఆలయాల వద్ద అమ్మవార్లకు మొక్కుబడులు చెల్లించేందుకు, కొత్త వాహనాలకు పూజలు చేసుకునేందుకు వచ్చిన భక్తుల వద్దకు గుంపులుగా చేరుకొని ట్రాన్స్‌జెండర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
News October 20, 2025
మంత్రి కోమటిరెడ్డి దీపావళి విషెస్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని ‘జ్ఞాన వెలుగులు నింపే పండుగ’గా ఆయన అభివర్ణించారు. దీపాలు చీకటిని తరిమినట్టుగానే, ఈ పండుగ ప్రజల జీవితాల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ప్రతి ఇంట్లో సకల శుభాలు కలిగించాలని కోరారు.
News October 20, 2025
నల్గొండ: పత్తి కూలీల ఆటో, ట్రాక్టర్ ఢీ

ముప్పారంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకంలో ముంచింది. పత్తికూలీల ఆటోను ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో ఆలంపల్లి సాయిలు అనే కూలీ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో 8 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను 108లో మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.