News December 19, 2024
సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయండి: ఎస్పీ

మహిళలు, విద్యార్థినుల భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్న నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఉంటూ జిల్లాలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను తరిమి కొట్టాలని ఎస్పీ అఖిల్ మహజన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులని చైతన్య పర్చే ఉద్దేశంతో ముస్తాబద్ మండలంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులకు రక్షణ, షీ టీమ్స్, ఈవ్ టీజింగ్, పోక్సోపై అవగాహన కల్పించారు.
Similar News
News October 19, 2025
కరీంనగర్ డీసీసీ చీఫ్ ఎంపిక.. రేసులో సత్యప్రసన్న!

KNR DCC అధ్యక్ష పదవి నియామక ప్రక్రియ వేగవంతమైంది. ఈ పదవి కోసం శనివారం జరిగిన ఇంటర్వ్యూలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాంరెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక MLA, AICC ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మన్నె ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. జిల్లాలో పార్టీ బలోపేతానికి సంబంధించిన తన ప్రణాళికలు, అభిప్రాయాలను ఆమె వివరించారు. జిల్లా స్థాయిలో మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేస్తానని తెలిపారు.
News October 19, 2025
కరీంనగర్లో 22న జాబ్ మేళా.!

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి తిరుపతి రావు తెలిపారు. వరుణ్ మోటార్స్ సంస్థలో ఉన్న 50 పోస్టులకు ITI, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు 20-35 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని అన్నారు. వేతనం రూ.10 వేల నుంచి ప్రారంభమౌతుందని, ఆసక్తి గలవారు 22న పేరు నమోదు చేసుకోవాలన్నారు. 8143865009, 9963177056, 8886619371, 7207659969కు సంప్రదించాలన్నారు.
News October 19, 2025
KNR: వైద్యాధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలి: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్లో శనివారం జిల్లా వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఈ సమీక్షలో పాల్గొన్నారు. వైద్యాధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, ఆసుపత్రుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.