News August 21, 2024
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మెదక్ ఎంపీ

మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావును వారి నివాసంలో కలిసి కొల్చారం మండలంలో ఉన్న వివిధ సమస్యల గురించి చర్చించారు. వచ్చే నెలలో మండలంలో పర్యటించి సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండు నాని, చిన్న ఘనపూర్ బూత్ అధ్యక్షుడు మంద మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 15, 2025
మెదక్: నేటి నుంచి 1,52,524 పశువులకు టీకాలు

పశువులకు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య కోరారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,52,524 పశువులు ఉండగా అందులో 48,909 ఆవులు, 1,03,615 గేదెలు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 46 బృందాలుగా ఏర్పడి వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు అన్ని గ్రామాల్లో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నామన్నారు.
News October 15, 2025
మెదక్: సీఎం కప్ విధుల కోసం దరఖాస్తు చేసుకోండి

సీఎం కప్ -2025లో విధులు నిర్వహించేందుకు మెదక్ జిల్లాలో ఉద్యోగ విరమణ పొందిన పీడీ/పీఈటీలు, జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారుల సేవలను వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి ప్రొ.రాధాకిషన్ సూచించారు. వివరాలను జిల్లా యువజన క్రీడల అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 9493594388, 7396313714 నంబర్లకు సంప్రదించాలన్నారు.
News October 15, 2025
రామాయంపేట: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పురుగుల మందు తాగి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గొలిపర్తి గ్రామానికి చెందిన ఎర్రం బాలకృష్ణ(40) కేసీఆర్ కాలనీలో నివాసం ఉంటారు. మంగళవారం రాత్రి గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.