News September 23, 2024
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: SP
కడప జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. కడప నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులకు ఫిర్యాదులను పంపిస్తూ వాటిని విచారించి సత్వరమే ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.
Similar News
News December 30, 2024
‘పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి’
కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా మినరల్ ఫండ్ ద్వారా నిర్మిస్తున్న వివిధ రకాల పెండింగ్ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలన్నారు.
News December 30, 2024
కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ సస్పెండ్
కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గురునాథ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్‌గా వున్న గురునాథ్ ఎస్ఐ అని చెప్పుకొంటూ ప్రజలను బెదిరించడం, సక్రమంగా విధులు నిర్వర్తించకుండా ఉండటంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వారు అందించిన నివేదిక ప్రకారం అతనిపై ఎస్పీ వేటు వేశారు
News December 30, 2024
కొత్త సీఎస్‌ది కడప జిల్లానే!
రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా నియమితులైన కె.విజయానంద్ మన జిల్లాకు చెందిన వారే. కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం. 1965లో జన్మించారు. అనంతపురం జేఎన్టీయూ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్ జనవరి 1వ తేదీన సీఎస్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఉన్నారు.