News January 19, 2025
సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తా: టీజీ వెంకటేశ్
నాయి బ్రాహ్మణ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం కర్నూలులో జరిగిన శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాలను కేఎంసీ కమిషనర్ రవీంద్రబాబు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సదాశివతో కలిసి టీజీ వెంకటేశ్ ప్రారంభించారు. నాయి బ్రాహ్మణ కులవృత్తి మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతుందని అన్నారు.
Similar News
News January 20, 2025
బేతంచెర్ల మండలంలో మహిళ ఆత్మహత్య
బేతంచెర్ల మండలం గొర్లగుట్ట గ్రామానికి చెందిన బోయ నాగలక్ష్మి(39) కడుపు నొప్పి తాళలేక పేడ రంగు నీళ్లు తాగి ఆత్మహత్య చేసుకుందని హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర గౌడ్ ఆదివారం తెలిపారు. కొంతకాలంగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉండేదని, వైద్యం చేయించినా నయం కాలేదన్నారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడ రంగు నీళ్లు తాగి ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
News January 20, 2025
ఆత్మకూరు: డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా
ఫైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు రూరల్ ఇన్స్పెక్టర్ సురేశ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాములపాడు గ్రామ శివారులోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, అసాంఘిక కార్యకలాపాలు, పేకాట వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ కెమెరాలను ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిని గుర్తించి, కేసులు నమోదు చేశామన్నాన్నారు.
News January 20, 2025
ఏపీ ఖజానా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా చంద్ర శేఖర్
ఆంధ్రప్రదేశ్ ఖజానా, లెక్కల సర్వీసెస్ అసోసియేషన్ నంద్యాల జిల్లా శాఖ కార్యవర్గ ఎన్నికలను ఆదివారం జిల్లా ఖజానా కార్యాలయంలో నిర్వహించారు. అసోసియేషన్ ఎన్నికల అధికారి ప్రభు దాస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా హెచ్.చంద్ర శేఖర్ (సీనియర్ అకౌంటెంట్), జిల్లా కార్యదర్శిగా వై.శ్రీనివాస రాజు (సీనియర్ అకౌంటెంట్), తదితర సభ్యులను ఎన్నుకున్నారు.