News April 25, 2024
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని ఫ్యాక్షన్ గ్రామాల పికెట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పకడ్బందీగా విధులు నిర్వహించాలని
సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
Similar News
News November 21, 2025
69వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

69వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం జొహరాపురం పరిధిలోని మున్సిపల్ హై స్కూల్ పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విజయానికి పొంగిపోకుండా పరాజయానికి ఒత్తిడి కాకుండా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. డీఈవో కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు.
News November 21, 2025
సర్వీస్ నుంచి కర్నూలు సీఐ శంకరయ్య డిస్మిస్

సీఐ జె.శంకరయ్యను పోలీస్ శాఖ సర్వీస్ నుంచి డిస్మిస్ (తొలగింపు) చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శంకరయ్య కర్నూలు వీఆర్లో ఉంటూ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. శంకరయ్యను క్రమశిక్షణా చర్యలపై డిస్మిస్ చేసినట్లు ఆయన తెలిపారు.
News November 21, 2025
PMAY-G పేరు నమోదు చేసుకోండి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (PMAY-G 2.0) కింద గృహాల కోసం లబ్ధిదారుల పేర్ల నమోదు చేసుకోవాలని కర్నూలు కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామ/వార్డు సచివాలయంలో పేర్ల నమోదుకు ఈ నెల 30లోపు పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


