News May 2, 2024
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోనీ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం పుట్టపర్తి మండలంలోని నిడిమామిడి, రాచువారి పల్లి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయా గ్రామాలలో గత ఎన్నికలలో తలెత్తిన ఘటనలను సమీక్షించారు. ఎన్నికల సందర్భంగా గొడవలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా వేయాలని సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News December 7, 2025
ఫ్లోర్ బాల్ అనంతపురం జిల్లా జట్టు ఇదే..!

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు అనంతపురం జిల్లా జట్టు సిద్ధమైంది. ఇవాళ నరసరావుపేటలో జరగనున్న 19వ సీనియర్ ఫ్లోర్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో అనంతపురం జిల్లా జట్టు పాల్గొంటుందని జిల్లా సెక్రటరీ కె.లక్ష్మీనారాయణ తెలిపారు. క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
News December 7, 2025
అంతనపురం మహిళా నేతకు కీలక పదవి

బీజేపీ మహిళా మోర్చా అనంతపురం జిల్లా అధ్యక్షురాలిగా అనంతపురానికి చెందిన సౌభాగ్య నియామకమయ్యారు. ఈ మేరకు అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేశ్ ఆమెకు నియామక పత్రం శనివారం అందజేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సౌభాగ్య చెప్పారు. పదవిని బాధ్యతగా భావిస్తానన్నారు.
News December 6, 2025
ఐక్యమత్యంతో ర్యాంకింగ్‌కు కృషి చేద్దాం: JNTU వీసీ

అనంతపురం JNTUలోని ఆర్యభట్ట ఆడిటోరియంలో శనివారం “Strategic RoadMap For Improving NIRF rankings” అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు, APSCHE వైస్ ఛైర్మన్ విజయ భాస్కర్ రావు పాల్గొన్నారు. వీసీ మాట్లాడుతూ.. ఐక్యమత్యంతో యూనివర్సిటీ ర్యాంకింగ్‌కు కలిసిగట్టుగా కృషి చేయాలని బోధనా సిబ్బందికి సూచించారు.


