News May 2, 2024
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోనీ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం పుట్టపర్తి మండలంలోని నిడిమామిడి, రాచువారి పల్లి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయా గ్రామాలలో గత ఎన్నికలలో తలెత్తిన ఘటనలను సమీక్షించారు. ఎన్నికల సందర్భంగా గొడవలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా వేయాలని సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News December 12, 2025
గుంతకల్లులో యువకుడి దారుణ హత్య

గుంతకల్లులో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని ఆదర్శ నగర్‌లో తాగునీటి కొళాయి వద్ద నీటి కోసం మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో చంద్రశేఖర్ అనే యువకుడిపై మరో వ్యక్తి వేట కొడవలితో దాడిచేసి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News December 12, 2025
టీడీపీలో చేరి కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎన్నిక

కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా 15వ వార్డు కౌన్సిలర్ గౌతమి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమెకు ఆర్డీఓ, ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ వసంత బాబు నియామక పత్రం అందజేశారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గౌతమి.. బుధవారం టీడీపీలో చేరారు. 24 మంది కౌన్సిలర్లకు గాను 22 మంది హాజరయ్యారు. ఇద్దరు గైరాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులిద్దరితో కలిపి 13 మంది గౌతమికి ఓటు వేయడంతో గెలుపొందారు.
News December 11, 2025
BREAKING: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా గౌతమి

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా తతలారి గౌతమి ఎన్నికయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు.


