News December 14, 2024

సమాఖ్య స్ఫూర్తికి జమిలి ఎన్నికలు విరుద్ధం: కూనంనేని

image

జమిలి ఎన్నికలు నిర్వహించాలనే కేంద్రం నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ విధానంతో లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక విధానంతో ప్రాంతీయ పార్టీల హక్కులకు భంగం కలిగే అవకాశమున్నందున తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

Similar News

News January 21, 2025

ఖమ్మం: గ్రామసభ ఏర్పాట్లు పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

image

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమైన నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని గ్రామాల్లో శాంతిభద్రతలకు సమస్య తలెత్తకుండా ఏర్పాటుచేసిన బందోబస్తును సీపీ సునీల్ దత్ పర్యవేక్షించారు. ఖమ్మం మంచుకొండ, మధిర నాగులవంచ, పాలేరు మద్దులపల్లి గ్రామ సభలను సందర్శించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వుండాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

News January 21, 2025

‘కన్న కూతురిని చంపబోయాడు’

image

కన్న కూతురిని తండ్రి కడతేర్చాలని చూసిన ఘటన ఈ నెల 13న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. టేకులపల్లి మం. సంపత్ నగర్‌కు చెందిన కొర్స రవి-లక్ష్మి దంపతులు. రవి భార్యతో గొడవ పడుతూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన అతను కూతురికి చాక్లెట్స్ కొనిస్తానని పక్కనే ఉన్న జామాయిల్లోకి తీసుకెళ్లి చంపబోయాడు. ఇంటికి వచ్చి బాలిక విషయం తల్లికి చెప్పడంతో అమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News January 21, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు
∆} జూలూరుపాడు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} పలు శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పర్యటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అశ్వరావుపేట లో ఎమ్మెల్యే పర్యటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం