News October 16, 2024
సమాచారం ఇవ్వండి.. బహుమతి పట్టండి: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా వ్యక్తులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తున్నా, రవాణా చేస్తున్నా, లేదా వినియోగిస్తున్నట్లు సమాచారం తెలిస్తే తక్షణమే 87125 84473 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పెద్ద మొత్తంలో గంజాయి సమాచారం తెలిపిన వారికి భారీగా నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు.
Similar News
News November 22, 2025
‘మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం లక్ష్యం’

దేశ ప్రగతి మహిళల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు ఏర్పాటుతో పాటు పారిశ్రామిక అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.
News November 22, 2025
ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ

ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ శనివారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
News November 21, 2025
నర్సంపేట: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న పట్టణంలోని అంగడి సెంటర్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటో నడుపుతున్న పట్టణానికి చెందిన మేకల మహేందర్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు మహేందర్ను నర్సంపేట న్యాయస్థానంలో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.


