News March 26, 2025
సమావేశంలో పాల్గొన్న అనకాపల్లి కలెక్టర్

అమరావతి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే సమావేశంలో కలెక్టర్లతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద పాల్గొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 28, 2025
పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

AP: YCP నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. సరెండర్ కావడానికి 2 వారాల గడువు ఇచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం వారు గతంలో హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. దీంతో SCని ఆశ్రయించారు.
News November 28, 2025
ఏకగ్రీవాలకు వేలంపాటలు.. SEC వార్నింగ్

TG: సర్పంచ్ ఎన్నికల వేళ ఏకగ్రీవాలకు జోరుగా వేలంపాటలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ పదవిని అంగట్లో సరుకులా డబ్బులు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు ప్రకటించేశారు. దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాల్సిన పదవిని వేలంపాటలో కొనుగోలు చేయడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
News November 28, 2025
IPLలో వైభవ్.. WPLలో దీయా

WPL వేలంలో హరియాణాకు చెందిన 16 ఏళ్ల దీయా యాదవ్ అందరి దృష్టిని ఆకర్షించారు. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్ అయిన ఆమెను రూ.10 లక్షల బేస్ ప్రైజ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. దీంతో WPLలో అడుగుపెట్టిన పిన్న వయస్కురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. 2023 U-15 ఉమెన్స్ ట్రోఫీలో 578 రన్స్ బాదడంతో దీయా పేరు తెరపైకి వచ్చింది. వైభవ్ సూర్యవంశీ 13ఏళ్లకే IPLలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.


