News February 5, 2025

సమిష్టి పోరాటంతోనే క్యాన్సర్ నియంత్రణ: మంత్రి సత్యకుమార్

image

ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సమిష్ఠి పోరాటంతోనే క్యాన్సర్ మహమ్మారిని నియంత్రించడం సాధ్యమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతిలో మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి ప్రపంచంలోని అన్ని దేశాలకూ పెను సవాలుగా మారిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో 17.5 శాతం మేర కేవలం క్యాన్సర్ వ్యాధి కారణంగానే సంభవిస్తున్నాయని ఆయన వివరించారు.

Similar News

News January 7, 2026

జగిత్యాల: భవిత కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి

image

జగిత్యాలలోని భవిత కేంద్రాన్ని DMHO డాక్టర్ సుజాత ఆకస్మికంగా సందర్శించారు. డిఫరెంట్ ఏబుల్డ్ చిన్నారులకు అందుతున్న సేవలను పరిశీలించి, అవసరమైతే శస్త్రచికిత్సలు, ప్రతివారం ఫిజియోథెరపీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. భవిత కేంద్రం నిర్వాహకులు రాజేందర్, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్.శ్రీనివాస్, ఆర్‌బీఎస్‌కే వైద్యులు డాక్టర్ సురేందర్, డాక్టర్ విద్య, ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

News January 7, 2026

బోయినపల్లి: యువకుడిపై కత్తితో దాడి

image

బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సావనపల్లి శశిప్రీతం అనే యువకుడిపై శ్రీధర్ అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరగింది. ఆ తర్వాత ఇద్దరం రాజీ పడదామని అంగీకారానికి వచ్చి ఒకే ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వాహనం వెనుక కూర్చున్న శ్రీధర్.. శశి ప్రీతంపై కత్తితో దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

News January 7, 2026

సిరిసిల్ల: అటవీ శాఖ రేంజ్ అధికారి సస్పెన్షన్

image

సిరిసిల్ల అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీహరి ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) సువర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగినిపై దురుసుగా ప్రవర్తించగా.. ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో విచారణ జరిపిన అధికారులు ఎఫ్ఆర్ఓ శ్రీహరి ప్రసాద్‌ను బుధవారం సస్పెండ్ చేశారు.