News January 1, 2025
సమీపిస్తున్న మినీ మేడారం జాతర!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో మన జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసిద్ధి చెందింది. అమ్మవార్ల మహా కుంభమేళా మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 12, 13, 14, 15వ తేదీల్లో వనదేవతల జాతర జరగనుంది. అయితే ఇప్పటికే భక్తులు వేల సంఖ్యలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో మేడారంలో భక్తుల సందడి మొదలైంది.
Similar News
News January 7, 2025
ములుగు అడవుల్లోనే కెమెరాకు చిక్కిన పులి
వెంకటాపురం సమీప అడవుల్లో నెల రోజుల క్రితం పెద్దపులి సంచరించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సుమారు నెలరోజుల పాటు వివిధ జిల్లాల అటవీ ప్రాంతంలో పులి సంచారం కొనసాగించింది. జనవరి 1న ములుగు జిల్లాలోని లింగాల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాకు పులి సంచారం చిక్కింది. మళ్లీ అవే ట్రాప్ కెమెరాలకు మరోసారి పెద్దపులి సంచారం కనిపించింది. దీంతో జిల్లాలోనే పులి ఉన్నట్లు తెలుస్తోంది.
News January 7, 2025
వరంగల్‌లో ఎక్కువ, ములుగు జిల్లాలో తక్కువ
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 30,43,540 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. అయితే మగవారితో పోలిస్తే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. HNK(D) 5,08,618, WGL(D) 7,73,453, జనగామ(D) 7,62,106, MHBD(D) 4,85,692, BHPL(D) 2,78,185, ములుగు(D) 2,35,486 మంది ఓటర్లు ఉన్నారు. WGL జిల్లాలో ఎక్కువ, ములుగులో తక్కువ మంది ఓటర్లు ఉన్నారు.
News January 7, 2025
వరంగల్: ఎయిర్‌పోర్టు కోసం స్థల పరిశీలన
మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన నిధులను, జీవోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన భూమిని అధికారులు సోమవారం పరిశీలించారు. ఖిలా వరంగల్ తహశీల్దార్ బండి నాగేశ్వర్ రావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఆనందం, కీర్తన్, సర్వేయర్ రజిత, ఏఈఈ రాజ్ కుమార్ తదితరులున్నారు.