News January 1, 2025
సమీపిస్తున్న మినీ మేడారం జాతర!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసిద్ధి చెందింది. అమ్మవార్ల మహా కుంభమేళా మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 12, 13, 14, 15వ తేదీల్లో వనదేవతల జాతర జరగనుంది. అయితే ఇప్పటికే భక్తులు వేల సంఖ్యలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో మేడారంలో భక్తుల సందడి మొదలైంది.
Similar News
News January 7, 2025
KNR: పంచాయతీ పోరు.. దావతుల జోరు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మార్చి, ఏప్రిల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ఫిబ్రవరిలోపే ఎలక్షన్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకముందే ఆశావహులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ముందస్తు దావతులు ఇస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈసారి సర్పంచ్ బరిలో నిలిచేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది.
News January 7, 2025
అత్యధికంగా కరీంనగర్, అత్యల్పంగా రామగుండం
ఉమ్మడి KNR జిల్లాలోని ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 29,98,815 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. అత్యధికంగా KNR నియోజకవర్గంలో 3,68,269 మంది ఉండగా.. 2,16,389 మంది ఓటర్లు అతి తక్కువగా రామగుండంలో ఉన్నారు. KNR(D) 10,83,365, జగిత్యాల(D) 7,20,825, PDPL(D) 7,18,042, SRCL(D) 4,76,604 ఉండగా.. హుస్నాబాద్ నియోజకవర్గంలో 2,51,150 మంది ఓటర్లు ఉన్నారు.
News January 7, 2025
జగిత్యాల: వెటర్నరీ సైన్స్ బెస్ట్ ప్రొఫెషన్: కలెక్టర్
వెటర్నరీ సైన్స్ బెస్ట్ ప్రొఫెషన్ అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల వెటర్నరీ కళాశాల వార్షికోత్సవ వేడుకలలో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వెటర్నరీ రంగం రైతుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుందని, పశుసంవర్ధక ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మెరుగవుతుందన్నారు. విద్యార్థులు ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రశంసించారు.