News August 2, 2024
సముద్రంలో మునుగుతున్న యువకుడిని కాపాడారు

బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక సముద్రతీరంలో అలల తాకిడికి మునిగిపోతున్న ఓ యువకుడిని గజఈతగాళ్లు, మెరైన్ పోలీసులు కాపాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్లకు చెందిన అచ్యుత మహేశ్ అనే యువకుడు శుక్రవారం సూర్యలంక సముద్ర తీరానికి వచ్చాడు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలలు రావడంతో యువకుడు మునిగిపోతుండగా, మెరైన్ పోలీసులు, గజఈతగాళ్లు గమనించి కాపాడారు.
Similar News
News December 9, 2025
ప్రకాశం: గుండెల్ని పిండేసే దృశ్యం.!

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పెంచికలపాడు వద్ద సోమవారం 2 లారీలు ఢీకొని వ్యక్తి లారీలోనే <<18508533>>సజీవ దహనమయ్యాడు.<<>> లారీలో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో బయటకు రాలేక నిస్సహాయ స్థితిలో డ్రైవర్ అగ్నికి ఆహుతయ్యాడు. అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపుచేసి వ్యక్తి శరీర భాగాలను అతి కష్టంమీద బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం బేస్తవారిపేట ఆసుపత్రికి తరలించారు. ఫొటోలోని దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
News December 9, 2025
ఇళ్ల స్థలాల దరఖాస్తుల్లో పెండింగ్ ఉండరాదు: JC

ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను పెండింగ్‌లో లేకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో సోమవారం జేసీ మాట్లాడుతూ.. ఇంటి పట్టాల రీ- వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. అలాగే ఇంటి పట్టాల రీ-వెరిఫికేషన్‌పై MROలు ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
News December 9, 2025
ప్రకాశం: ‘డిసెంబర్ 31 వరకు అవకాశం’

ఇంట్లో గృహోపకరణాలపై అడిషనల్ లోడ్‌పై చెల్లింపులో 50% రాయితీ ఇస్తున్నట్లు SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. 1కిలో వాట్‌కు రూ.2250 అవుతుందని రాయితీ వలన రూ.1250 చెల్లించవచ్చని అన్నారు. ఈ అవకాశం ఈనెల 31 వరకు మాత్రమేనని తెలిపారు. ఇంట్లో గృహోపకరణాలను బట్టి లోడ్ కట్టుకోవాలన్నారు. తనిఖీల్లో లోడ్ తక్కువగా ఉంటే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.


