News August 2, 2024
సముద్రంలో మునుగుతున్న యువకుడిని కాపాడారు
బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక సముద్రతీరంలో అలల తాకిడికి మునిగిపోతున్న ఓ యువకుడిని గజఈతగాళ్లు, మెరైన్ పోలీసులు కాపాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్లకు చెందిన అచ్యుత మహేశ్ అనే యువకుడు శుక్రవారం సూర్యలంక సముద్ర తీరానికి వచ్చాడు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలలు రావడంతో యువకుడు మునిగిపోతుండగా, మెరైన్ పోలీసులు, గజఈతగాళ్లు గమనించి కాపాడారు.
Similar News
News September 10, 2024
వరద బాధితులకు రూ.10.60 కోట్లు విరాళం: మంత్రి గొట్టిపాటి
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో సీఎంను ఆ శాఖ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఒకరోజు జీతాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. దాదాపు 10.60 కోట్ల రూపాయలను వరద బాధితుల సహాయార్థం అందించారని మంత్రి చెప్పారు. అలాగే విద్యుత్ పునరుద్ధరణలో ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారని అన్నారు.
News September 10, 2024
ప్రకాశం: దారుణం.. చిన్నారిపై బాబాయి అత్యాచారం!
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం మన్నేటికోటలో దారుణం జరిగింది. 9 ఏళ్ల చిన్నారిపై వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి మానవ మృగంలా అరాచకానికి పాల్పడ్డాడు. తినుబండారాల పేరుతో మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకెళ్లిన కార్తీక్ (20) అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఆ కీచకుడు పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న ఉలవపాడు పోలీసులు చిన్నారిని కందుకూరు ఆసుపత్రికి తరలించారు.
News September 10, 2024
అద్దంకి : ఇద్దరు మంత్రుల చొరవ.. రాత్రికి రాత్రే రక్ష
భారీ వర్షాలు, వరదలకు బాపట్ల జిల్లాలోని పెదపులివర్రు, పెనుమూడి, రుద్రవరం, రావిఅనంతారం గ్రామాల్లో కుడికరకట్ట చాలాచోట్ల బలహీనపడింది. దీంతో మంత్రులు అనగాని, గొట్టిపాటి అధికారులతో చర్చించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికుల సాయంతో 100కి పైగా ట్రాక్టర్ల మట్టిని 15వేలకుపైగా బస్తాల్లో నింపి రాత్రికి రాత్రి కరకట్టపై రక్షణ కవచంలా ఏర్పాటు చేశారు.