News March 20, 2024

సముద్ర దొంగల ఆట కట్టించేందుకు వ్యూహాత్మక అడుగులు: యూఎస్ రాయబారి

image

సాగర జలాల సరిహద్దుల్లో చొరబాట్లు, సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు భారత్‌తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని భారత్‌–యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టి వెల్లడించారు. ట్రయంఫ్‌ యుద్ధ విన్యాసాల కోసం విశాఖ తూర్పు నావికాదళ ప్రధాన కార్యలయానికి వచ్చిన ఆయన ఐఎన్‌ఎస్‌ జలశ్వ యుద్ధ నౌకలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. భారత్, అమెరికా మధ్య రక్షణ విభాగ బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు.

Similar News

News March 13, 2026

విశాఖ పోలీసులను అభినందించిన సీఎం

image

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సైబర్ నేరాలపై విశాఖ పోలీసులు రూపొందించిన 24 షార్ట్ ఫిలింలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్రంలో సైబర్ మోసాలతో రూ.వేల కోట్ల నష్టం జరుగుతున్న నేపథ్యంలో అవగాహన పెంచేందుకు వీటిని రూపొందించినట్లు విశాఖ సీపీ బాగ్చీ వివరించారు. ఈ కృషికి పోలీసులను సీఎం అభినందించారు.

News March 12, 2026

మధురవాడ: ఉరివేసుకుని యువకుడు మృతి!

image

మధురవాడ గణేష్ నగర్‌లో తాడి ప్రవీణ్ కుమార్ (27) అనే యువకుడు మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చింతపల్లికి చెందిన ప్రవీణ్ గత ఆరేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తూ, స్థానిక టెలిఫోన్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 12, 2026

విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చర్లపల్లికి కొత్త సూపర్ ఫాస్ట్ రైలు!

image

రైల్వే ఆధునీకరణలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. కొక్రాఝర్ – చర్లపల్లి (05674) స్పెషల్ రైలు శనివారం సాయంత్రం పెందుర్తి (17:58), దువ్వాడ (19:30) స్టేషన్లకు చేరుకుంటుంది. 20 కోచ్‌లతో నడిచే ఈ అత్యాధునిక రైలు సామాన్య ప్రయాణికులకు హైదరాబాద్ వెళ్లేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది