News February 14, 2025
సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న ఎస్పీ

ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, డీఎస్పీ రవీందర్, క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ కిషోర్ కుమార్, సీఐలు శంకర్, రవీందర్ వన దేవతలను దర్శించుకున్నారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే సారె సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఎస్పీతో పోలీస్ అధికారులను పూజారులు, ఎండోమెంట్ అధికారులు శాలువాతో సన్మానించి అమ్మవారి ప్రసాదం అందించారు.
Similar News
News November 17, 2025
HYD: ఈ ఏరియాల్లో మొబైల్స్ మాయం!

నగరంలోని రద్దీ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, బస్టాండ్లు, మార్కెట్లు, రైల్వే స్టేషన్ల వద్ద రెప్ప పాటు క్షణాలలో దొంగలు సెల్ఫోన్లు ఎత్తుకుపోతున్నారు. సిటీ పరిధిలో నిత్యం 30-40 మొబైల్ చోరీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బహిరంగ ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు.SHARE IT
News November 17, 2025
ఉమ్మడి MBNR వ్యాప్తంగా నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

సమ్మె కారణంగా తెలంగాణ పత్తి మిల్స్ అసోసియేషన్ నేటి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల నిబంధనను తొలగించి, 7 క్వింటాళ్ల కొనుగోలు నిబంధన విధించడంతో పాటు మిల్లులకు గ్రేడ్స్ కేటాయించడంపై వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగానే ఈ సమ్మె చేస్తున్నట్లు మిల్లుల యజమానులు స్పష్టం చేశారు. SHARE IT.
News November 17, 2025
లోక్ అదాలత్ ద్వారా 5838 కేసులు పరిస్కారం: CP

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని, వీటి ద్వారా 5838 కేసులు పరిష్కారమయ్యాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన 5838 కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు-605, ఈ పెటీ కేసులు -2583, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు – 2650, సైబర్ కేసులు -195 పరిష్కరించడం ద్వారా రూ.92,45,636 బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు.


