News December 23, 2024
సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కలెక్టర్లు

మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతలను ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ధోత్రే వెంకటేశ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పటేల్లు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజార్లు, ఎండోమెంట్ అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క సారలమ్మలకు పసుపు, కుంకుమ, చిరే, సారే సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
Similar News
News December 3, 2025
నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిన చూడాలి: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. అమిన్పేట క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లు, సిబ్బంది పనితీరు, అభ్యర్థుల రద్దీ, సమర్పణ ప్రక్రియను ఆమె సమగ్రంగా పరిశీలించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.
News December 3, 2025
వంజరపల్లిలో సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ!

సంగెం మండలం వంజరపల్లిలో ఎస్టీ జనాభా లేకపోవడంతో సర్పంచ్, 1,4,6 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఎస్టీ జనాభా లేని గ్రామానికి ఈ పదవులు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లింది. నామినేషన్ గడువు ముగిసే సమయానికి 5 వార్డులకు మాత్రమే నామినేషన్లు రావడంతో, ఉప సర్పంచ్గానే గ్రామ పాలన నడిచే పరిస్థితి.
News December 1, 2025
గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సత్య శారద సమీక్ష

వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డ్ మెంబర్ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నియమించిన నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు నోడల్ అధికారులు మరింత శ్రద్ధ వహించాలని ఆదేశాలు జారీ చేశారు.


