News December 23, 2024

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కలెక్టర్లు

image

మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతలను ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ధోత్రే వెంకటేశ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పటేల్‌లు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజార్లు, ఎండోమెంట్ అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క సారలమ్మలకు పసుపు, కుంకుమ, చిరే, సారే సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

Similar News

News January 23, 2025

వరంగల్ మార్కెట్‌కి అరుదైన మిర్చి ఉత్పత్తుల రాక

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. ఎల్లో మిర్చి క్వింటా రూ.18 వేలు, 2043 రకం మిర్చి రూ.14 వేలు, 273 రకం మిర్చి రూ. 12వేలు, హరిణి మిర్చి రూ.14 వేలు, అకిరా బ్యాగడి మిర్చి రూ.13 వేలు పలికింది.అలాగే పాత తేజా మిర్చి ధర రూ.13,300, పాత 341 రకం మిర్చి ధర రూ.14,300, పాత వండర్ హాట్ మిర్చి రూ.13,600, 5531 మిర్చి రూ.12 వేల ధర పలికినట్లు అధికారులు పేర్కొన్నారు.

News January 22, 2025

మట్టెవాడ: విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన సదస్సు

image

మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలపై మట్టెవాడలోని ఓ కళాశాలలో విద్యార్థినులకు పోలీసులు అవగాహన కల్పించారు. వీటితో పాటు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, ర్యాగింగ్, షీ టీం పోలీసుల పనితీరు గురించి వివరించారు. పోలీసులను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు.

News January 22, 2025

WGL: తరలివచ్చిన పసుపు, పల్లికాయ.. ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు పసుపు, పల్లికాయ తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపు ధర రూ.12,112 పలికినట్లు అధికారులు తెలిపారు. అలాగే సూక పల్లికాయకి నిన్న రూ. 6100 ధర రాగా.. నేడు రూ.6200 ధర వచ్చింది. పచ్చి పల్లికాయ నిన్నటి లాగే రూ.4400 ధర పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.