News February 7, 2025
సమ్మక్క-సారలమ్మ గద్దెలపై హుండీలు ఏర్పాటు

మేడారం చిన్న జాతర ఈనెల 12 నుంచి 15 వరకు జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో ఎండోమెంట్ అధికారులు హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపై 14 హుండీలు, సారలమ్మ గద్దెపై 14 హుండీలు, పగిడిద్దరాజు గద్దెపై 2 హుండీలు, గోవిందరాజుల గద్దెపై 2 హుండీలు మొత్తం 32 హుండీలను ఏర్పాటు చేశారు. ఈవో రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతి, పరకాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ కవిత, అర్చకులు పాల్గొన్నారు.
Similar News
News February 7, 2026
ఈ నెల 9న సా.5 గంటలకు ప్రచారం బంద్: ADB కలెక్టర్

మున్సిపల్ పోలింగ్‌కు 48 గంటల ముందు అంటే ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బహిరంగ సభలు, ఊరేగింపులు నిషేధమని, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా సినిమాలు, టీవీ లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.
News February 7, 2026
NZB: సండేతో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ గడువు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విధులలో నిమగ్నం అయి ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో నిమగ్నం అయి ఉన్న పోలీసు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు.
News February 7, 2026
NZB: అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి: CP

పోలీస్ శాఖలో ప్రతి సిబ్బంది పాత్ర అత్యంత ముఖ్యమని, వారు తమకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని CP సాయి చైతన్య సూచించారు. శనివారం ఆయన కోర్ట్ డ్యూటీ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల పరిష్కారం త్వరితగతిన ముగిసేలా సాక్ష్యులను ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్షపడేలా చూసి పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంచే విధంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు.


