News February 7, 2025
సమ్మక్క-సారలమ్మ గద్దెలపై హుండీలు ఏర్పాటు

మేడారం చిన్న జాతర ఈనెల 12 నుంచి 15 వరకు జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో ఎండోమెంట్ అధికారులు హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపై 14 హుండీలు, సారలమ్మ గద్దెపై 14 హుండీలు, పగిడిద్దరాజు గద్దెపై 2 హుండీలు, గోవిందరాజుల గద్దెపై 2 హుండీలు మొత్తం 32 హుండీలను ఏర్పాటు చేశారు. ఈవో రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతి, పరకాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ కవిత, అర్చకులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
ఎస్సీ వర్గీకరణలో చంద్రబాబుది కీలకపాత్ర: మందకృష్ణ

AP: SC వర్గీకరణపై APఅసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణలో CM చంద్రబాబు పాత్ర కీలకమని పేర్కొన్నారు. ‘1997-98లోనే వర్గీకరణపై చంద్రబాబు తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆయన న్యాయం వైపే ఉన్నారు. జగన్ ఉంటే వర్గీకరణ జరిగేది కాదు. మోదీ, అమిత్ షా, వెంకయ్య, కిషన్ రెడ్డి, పవన్ అండగా నిలిచారు’ అని వ్యాఖ్యానించారు.
News March 21, 2025
నిర్మల్: పది పరీక్షకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రామారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9,122 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 9,115 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. కాగా జిల్లా వ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News March 21, 2025
ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలి: కలెక్టర్

నర్సింగ్ విద్యార్థులకు తరగతులు నిర్వహణకు తాత్కాలికంగా ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో వైద్య, నర్సింగ్, ఆయుష్, సీహెచ్‌సీ, టీజీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు .కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుష్ భవనంలోని రెండు అంతస్థులను నర్సింగ్ కళాశాల నిర్వహణకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు.