News March 15, 2025
సమ్మర్ ఎఫెక్ట్… జూ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు

ఎండలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో జూ పార్క్ అధికారులు జంతువుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంక్లోజర్ల వద్ద స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్ ఏర్పాటు చేశారు. పక్షులు ఇబ్బంది పడకుండా వాటి చుట్టూ గడ్డి ఏర్పాటు చేశారు. బాతుల రక్షణకు షేడ్ నెట్స్ ఉపయోగిస్తున్నారు.
Similar News
News March 17, 2025
HYD: ఓయూ బంద్‌కు ABVP పిలుపు

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు ఇక మీదట అనుమతి లేదని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది నియంతృత్వ పోకడ అంటూ ABVP మండిపడుతోంది. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నేడు ఉస్మానియా యూనివర్సిటీ బంద్‌కు నాయకులు పిలుపునిచ్చారు. రిక్రూట్‌మెంట్, నిధుల కొరత, ఆహార నాణ్యత అంశాలపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారనే నెపంతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.
News March 17, 2025
OUలో పీహెచ్‌డీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీల కేటగిరి 2 పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు గడువును పొడిగించినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రూ. 2000 అపరాధ రుసుంతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్షలు వచ్చేనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
News March 17, 2025
కాచిగూడ: ‘దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలి’

దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలో రోడ్డుపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో బీసీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దేశ జనాభాలో 60శాతనికి పైగా ఉన్న బీసీలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయన్నారు.