News March 23, 2025
సరస్వతి పుష్కరాలు.. భూపాలపల్లి కలెక్టర్ కీలక ఆదేశాలు

సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరంలో విద్యుత్ సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అవసరం మేరకు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్ల వద్ద భద్రతా చర్యలు పటిష్ఠంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
ధర్మపురి: జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహన తనిఖీలు: ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలను ముమ్మరంగా చేపట్టనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం చెక్ పోస్టును, వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ రావు పేట పోలింగ్ కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా అనుచిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 6, 2025
తిరుపతిలో 10వ తేదీన ఇంటర్వ్యూలు

శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS)లో 10వ తేదీన వివిధ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కార్యాలయం పేర్కొంది. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్టు -04, న్యూక్లియర్ మెడిసిన్ రేడియో ఫార్మసిస్ట్-01 మొత్తం 5 పోస్టులకు అవకాశం ఉంది. అర్హత, ఇతర వివరాలకు https://svimstpt.ap.nic.in/jobs.html వెబ్సైట్ చూడొచ్చు.


