News March 23, 2025

సరస్వతి పుష్కరాలు.. భూపాలపల్లి కలెక్టర్ కీలక ఆదేశాలు

image

సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరంలో విద్యుత్ సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అవసరం మేరకు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్ల వద్ద భద్రతా చర్యలు పటిష్ఠంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News April 19, 2025

MNCL: పోలీసులను ఇబ్బంది పెట్టిన ముగ్గురి అరెస్ట్

image

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉన్న బ్లూకోల్ట్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు రవి ఓ లాడ్జి ఎదుట బైక్‌పై ముగ్గురు వ్యక్తులు కూర్చొని న్యూసెన్స్ చేస్తుండగా వెళ్లి అడిగారు. డ్యూటీలో ఉన్నారని తెలిసి పోలీసులను తిట్టిన బానోత్ సాయి వికాస్, సిలారపు వినయ్‌, ఓ మైనర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News April 19, 2025

ఇది నమ్మశక్యంగా లేదు: రోహిత్ శర్మ

image

వాంఖడే స్టేడియంలో స్టాండ్‌కు తన పేరును పెట్టడంపై రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా ఫేవరెట్ రంజీ ప్లేయర్లను చూసేందుకు వాంఖడే బయట ఎదురుచూస్తూ ఉండేవాడిని. స్టేడియంలోకి అందర్నీ రానిచ్చేవారు కాదు. అలాంటిది అదే స్టేడియంలో నా పేరిట స్టాండ్ అంటే చాలా భావోద్వేగంగా ఉంది. నమ్మశక్యంగా లేదు. ఇది ఎంతోమంది క్రికెటర్లకు కల’ అని హర్షం వ్యక్తం చేశారు.

News April 19, 2025

వ్యవసాయంలో నూతన సాంకేతికతను అలవర్చుకోవాలి: రాజనర్సింహ

image

రైతులందరూ నూతన సాంకేతిక నలబరుచుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారంలో అయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయాన్ని కాంగ్రెస్ పార్టీ పండగల మార్చిందన్నారు. రాయికోడ్ ప్రాంతానికి లిఫ్టు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

error: Content is protected !!