News March 1, 2025
సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి: భూపాలపల్లి కలెక్టర్

సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సరస్వతి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇరిగేషన్ 4, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం 7, మిషన్ భగీరథ 15, దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం 28, విద్యుత్ 11, మొత్తం 65 పనులు పూర్తి చేయాల్సి ఉన్నట్లు తెలిపారు.
Similar News
News March 1, 2025
విడాకులు దొరకవనే భయంతో టెకీ ఆత్మహత్య?

మానవ్‌శర్మ మృతికి విడాకుల భయమే కారణమని మృతుడి సోదరి తెలిపింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలిసిన తర్వాత విడిపోదామనుకున్నాడంది. అయితే అదంత సులువు కాదని, చట్టాలన్నీ మహిళల వైపే ఉంటాయని భార్య నికిత బెదిరించేదని చెప్పింది. ఫిబ్రవరి 23న కూడా లీగల్ ప్రొసీడింగ్‌కు వెళ్లాల్సి ఉండగా, మానవ్‌ను ఆగ్రా తీసుకొచ్చి మరోసారి బెదిరించిందని తెలిపింది. భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించింది.
News March 1, 2025
జిల్లాలో 38 పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

KMR జిల్లాలో 38 కేంద్రాలలో 18,469 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ తెలిపారు. మొదటి సంవత్సరంలో 8743 మంది, ద్వితీయ సంవత్సరంలో 9726 మంది పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. మార్చి 5 నుంచి 25 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్ సరఫరా, మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
News March 1, 2025
నంద్యాల జిల్లాలో 87.75% పింఛన్ల పంపిణీ.!

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నంద్యాల జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. మ.2:30 గంటలకు నంద్యాల జిల్లాలో 87.75% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా ఇప్పటివరకు జిల్లాలో 2,15,031 మందికి గానూ 1,88,688 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.