News November 20, 2024

సరిత తిరుపతయ్యకు కీలక పదవి?

image

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. కొత్త అధ్యక్షరాలిని నియమించాలని ఇటీవల ఏఐసీసీ కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా గద్వాల మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా తిరుపతయ్యకు కీలక పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన సరితను రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమిస్తారనే టాక్ వినిపిస్తోంది.

Similar News

News December 12, 2024

మహబూబ్‌నగర్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

image

ఉమ్మడి MBNR జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలిలా.. జడ్చర్ల మండలం లింగంపేట మాజీ సర్పంచ్ కృష్ణయ్యగౌడ్(45) మృతిచెందగా.. ఆగి ఉన్న లారీ ఢీకొని రాంప్రకాశ్, లవకుశ్ మృతి చెందారు. కర్నూల్ జిల్లాకి చెందిన గొడ్డయ్యగౌడ్ పాల పాకెట్ల కోసం వెళ్లి రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనండంతో చనిపోయాడు. నవాబుపేట మండలం పోమాల్‌కి చెందిన రాజు నడుస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు

News December 12, 2024

నాగర్‌కర్నూల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేవల్లి వద్ద జరిగిన రోడ్డు <<14853514>>ప్రమాదంలో <<>>ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. UP బల్‌రాంపూర్‌ జిల్లాకి చెందిన రాంప్రకాశ్(35), లవకుశ్(33) కల్వకుర్తి నుంచి మిడ్జిల్ వైపు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు మీద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. కేసు నమోదైంది.

News December 12, 2024

MBNR: ‘ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రైతులకు రుణాలు’

image

రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు అందజేస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ప్రియబ్రతమిశ్రా చెప్పారు. MBNR SBI రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సమావేశం బుధవారం నిర్వహించారు. డీజీఎం మాట్లాడుతూ..రైతుల కోసం రైతులే నిర్వహించుకునే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు తమ బ్యాంకు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.