News July 26, 2024

సరుబుజ్జిలి: అగ్రికల్చర్ అసిస్టెంట్ సస్పెండ్

image

సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ సచివాలయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కే.దుర్గారావు విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు గాను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఏవో బొడ్డేపల్లి పద్మనాభం గురువారం తెలిపారు. మద్యం సేవించి విధులకు హాజరు కావడం విత్తనాలు, ఎరువుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Similar News

News October 19, 2025

ప్రేమికుల వివాదంలో కూన పేరు.. ఖండించిన MLA

image

ఆముదాలవలస MLA కూన రవికుమార్‌పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘మా అమ్మాయిని ఓ యువకుడు ఐదేళ్లు ప్రేమించాడు. పెళ్లికి ఒప్పుకొని ఇప్పుడు చేసుకోనంటున్నాడు. వాళ్ల వెనుక ఎమ్మెల్యే కూన ఉన్నారంటూ యువకుడు బెదిరిస్తున్నాడు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు’ అని ఆమె వాపోయింది. కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ ఆరోపణలను MLA ఖండించారు.

News October 19, 2025

శ్రీకాకుళం: ఇంటికొస్తూ యువకుడి మృతి

image

దీపావళి కోసం ఇంటికొస్తూ ఓ వ్యక్తి చనిపోయిన విషాద ఘటన ఇది. ఇచ్ఛాపురం(M) లొద్దపుట్టికి చెందిన వసంత్ కుమార్(32), బెల్లుపడ అచ్చమ్మపేటకు చెందిన సంధ్యకు మార్చిలో పెళ్లి జరిగింది. వసంత్ కుమార్ విజయవాడలో పనిచేస్తూ అక్కడే కాపురం పెట్టాడు. దీపావళి కోసం బైకుపై ఇద్దరూ స్వగ్రామానికి శనివారం బయల్దేరారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద హైవేపై ఆగిఉన్న లారీని ఢీకొట్టారు. భర్త చనిపోగా భార్య తీవ్రంగా గాయపడింది.

News October 19, 2025

జీఎస్టీ 2.0తో మంచి సంస్కరణలు: కేంద్రమంత్రి

image

జీఎస్టీ 2.0 తో మంచి సంస్కరణలు అమలు అయ్యాయని కేంద్ర పౌరవిమానయన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం NTR మున్సిపల్ గ్రౌండ్స్‌లో సిక్కోలు ఉత్సవ్ పేరుతో జరుగుతున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన శనివారం హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో GST2.0ను పీఎం మోదీ అమలు చేశారన్నారు.