News December 7, 2024

సరూర్‌నగర్ BJP సభ (అప్‌డేట్స్)

image

సరూర్‌నగర్‌ సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపామని BJP నేతలు పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, BJP ఎమ్మెల్యేలు, హైదరాబాద్, రంగారెడ్డికి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజల పక్షాణ BJP నిరంతరం పోరాటం చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.

Similar News

News November 27, 2025

HYD: విషాదం..11 ఏళ్లకే సూసైడ్

image

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన వెలుగుచూసింది. సుభాష్‌నగర్‌లో నివాసం ఉండే బాలుడు(11) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. సూసైడ్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చిన్న వయసులో బాలుడి కఠిన నిర్ణయం స్థానికులను కలచివేసింది.

News November 27, 2025

HYD: FREE‌గా వెళ్లొద్దాం రండి!

image

HYD పరిధి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతోంది. నవంబర్ 30 వరకు ఉ.10 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుందని HYD టూరిజం తెలిపింది. ఉచితంగా రాష్ట్రపతి నిలయం, వివిధ రకాల, కళలు వీక్షించే అవకాశం ఉంది. సా.7:00 వరకు లాస్ట్ ఎంట్రీగా పేర్కొన్నారు. QR కోడ్ స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి.

News November 27, 2025

అయోధ్య ఆలయంలో హైదరాబాద్ కిటికీలు

image

కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిథాని) సంస్థ అయోధ్యలోని రామాలయం కోసం కిటికీలను తయారుచేసింది. టైటానియం ఆర్కిటెక్చరల్‌ విండోలను తయారుచేసి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేసినట్లు మిథాని అధికారులు తెలిపారు. 31 కీటికీలను తయారు చేసి ఆలయానికి ఇచ్చామని వివరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రదక్షణ కారిడార్‌ కోసం ఇంజినీరింగ్‌ విభాగం వీటిని తయారుచేసింది.