News February 12, 2025

సరూర్ నగర్: రేపు కబడ్డీ జట్ల ఎంపిక

image

రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలు రేపు సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గం.కు ఎంపిక ఉంటుందని, 16 ఏళ్లలోపు బాల బాలికలు ఆధార్ కార్డుతో ఎంపికకు హాజరు కావాలన్నారు. ఎంపికైన వారు వికారాబాద్ జిల్లాలో జరిగే 34వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా పోటీల్లో ఆడుతారన్నారు.

Similar News

News March 23, 2025

తడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మ‌ృతి

image

తడ మండలం పెరియావట్టు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నై నుంచి ఉబ్బల మడుగు పర్యాటక కేంద్రానికి వెళుతుండగా కారు చెట్టుకు ఢీకొంది. ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి  తీవ్ర గాయాలు అయ్యాయి. కారు స్పీడ్ వల్ల  నుజ్జు నుజ్జు అయినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News March 23, 2025

షాద్‌నగర్‌లో హాస్టల్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం

image

షాద్‌నగర్ పట్టణంలోని బాలుర హాస్టల్‌ పైఅంతస్తు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి దూకాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్‌కి చెందిన చందు ఈరోజు మధ్యాహ్నం బిల్డింగ్ పైనుంచి అకస్మాత్తుగా కిందికి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News March 23, 2025

SRHvRR: టాస్ గెలిచిన RR

image

ఉప్పల్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో SRH ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

error: Content is protected !!