News April 23, 2025

సర్కార్ బడిలో మెరిసిన ఆణిముత్యం

image

తాజాగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో పల్నాడు జిల్లా విద్యార్థిని అద్భుతంగా రాణించారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల జడ్పీ పాఠశాల విద్యార్థిని పావని చంద్రిక 600కు 598 మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో చదవి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన విద్యార్థినిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ లలిత, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.

Similar News

News April 24, 2025

TODAY HEADLINES

image

* ఉగ్రదాడి బాధితులకు రూ.10లక్షల పరిహారం: చంద్రబాబు
* హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్
* పహల్‌గామ్ ఉగ్రదాడి.. భారత్ సంచలన నిర్ణయం
* ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
* తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
* భారీగా తగ్గిన బంగారం ధర
* IPLలో SRH ఘోర పరాజయం

News April 24, 2025

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: రామ్మోహన్

image

కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి భౌతికకాయాన్ని విశాఖ ఎయిర్‌పోర్టులో ఎంతో బాధతో స్వీకరించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. చనిపోయిన వారికి సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి నివాళులు అర్పించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ కష్టసమయంలో వారికి అండగా ఉంటామన్నారు.

News April 24, 2025

బాపట్ల: రూ.25 లక్షలతో కొళాయిలు- కలెక్టర్

image

బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని చిన్న కొత్త గొల్లపాలెంలో జల జీవన్ మిషన్ కింద రూ.25 లక్షలతో కొళాయి కనెక్షన్లు ఇస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి బుధవారం తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీల అమలుపై జిల్లా అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్ కింద పనులు మంజూరు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

error: Content is protected !!