News December 15, 2024
సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి సీఎం నివాళి
సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన జీవిత చరిత్రను గురించి చంద్రబాబు కొనియాడారు. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం, తెలుగుజాతి కోసం 56 రోజుల పాటు నిరాహారదీక్ష చేసి ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, మహారాష్ట్ర వంటి భాషా ప్రభుత్వ రాష్ట్రాల ఏర్పాటుకు తోడ్పడ్డారన్నారు.
Similar News
News January 16, 2025
గుంటూరు: పలు పోస్టులకు నోటిఫికేషన్
గుంటూరు DCCBలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఇందుకు సంబంధించి వివరాలను అధికార సైట్లో ఉంచారు. గుంటూరు DCCBలో 31 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 50 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఈనెల 22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరిలో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించే అవకాశముంది.
News January 16, 2025
గుంటూరు: అత్తగారింట్లో 200 రకాల పిండి వంటలతో విందు
గుంటూరుకు చెందిన త్రిపురమల్లు వైష్ణవ్‌కు మొగల్తూరుకి చెందిన విష్ణు ప్రియతో గత ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. సంక్రాంతి సందర్భంగా తొలి పండుగకు అల్లుడితో పాటు కుటుంబ సభ్యులను విష్ణు ప్రియ తల్లిదండ్రులు ఫణి, ఝాన్సీలు ఆహ్వానించారు. దీంతో వారు బుధవారం మెుగల్తూరులో కొత్త అల్లుడు వైష్ణవ్‌కు 200 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేసి మర్యాద చేశారు.
News January 16, 2025
GNT: భారత సైన్యంలో సేవలందించని గడపలు ఆ ఊళ్లో లేవు
భారత సైనిక వ్యవస్థలో నిజాంపట్నం మండలం బావాజీపాలెం గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రామంలోని 98 శాతం ఇళ్లలో సైనికులు, మాజీ సైనికులు ఉన్నారు. దీంతో బావాజీపాలెం మిలటరీ గ్రామంగా ప్రసిద్ధి చెందింది.1965 చైనా యుద్ధం, 1971 పాకిస్థాన్ యుద్ధం, 1999 కార్గిల్ ఇలా ప్రతి యుద్ధంలో ఈ గ్రామ సైనికులు పాల్గొన్నారు. ఈ గ్రామాన్ని 1978లో భారత ఆర్మీ దత్తత తీసుకొని గ్రామంలో వాటర్ ట్యాంకు నిర్మించింది.