News May 3, 2024
సర్పంచ్‌లను MLA చేసిన చరిత్ర ‘అనపర్తి’ ఓటర్లది

ఉమ్మడి తూ.గో జిల్లాలో అనపర్తి నియోజకవర్గ ఓటర్ల నాడీ పట్టడం కష్టమే. ఇప్పటివరకు ఇక్కడ 15సార్లు ఎన్నికలు జరగ్గా.. సర్పంచ్‌లకు సైతం ఎమ్మెల్యేలుగా పట్టం కట్టి అసెంబ్లీకి పంపిన చరిత్ర ఇక్కడి ఓటర్లది. 1971లో రామవరం సర్పంచ్‌గా గెలిచిన మూలారెడ్డి 1983లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే కాగా.. అనపర్తి సర్పంచ్‌గా గెలిచిన రామారెడ్డిని కాంగ్రెస్ తరఫున 1989, 2004లో ఎమ్మెల్యేగా గెలిపించారు.
Similar News
News November 9, 2025
సబ్సిడీ వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం: ఈడీ

తూ.గో జిల్లాలోని సఫాయి కర్మచారి నిరుద్యోగ యువతకు NSKFDC పథకంలో భాగంగా సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు మంజూరు చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి తెలిపారు. అర్హులైన వారు కాకినాడలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు 62818-17023 నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు.
News November 9, 2025
తుఫాన్ నష్టం అంచనాకు 10న కేంద్ర బృందం

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఈనెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమిబసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం, నష్టం, పునరావాస చర్యలపై కేంద్రానికి నివేదిక ఇస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు.
News November 8, 2025
తాళ్లపూడి: యాసిడ్ పడి ఇద్దరికి గాయాలు

తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోతులమయమైన రహదారిపై వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ నుంచి కుదుపులకు యాసిడ్ లీకైంది. అది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.


