News February 7, 2025

సర్పంచ్ ఎన్నికలకు సంగారెడ్డి జిల్లా వివరాలు

image

గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో జిల్లాలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఇప్పటినుంచి తమ వంతుగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ZPTC- 27, MPP-27, ఎంపీటీసీ- 276, గ్రామ పంచాయతీలు 633 ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 295 నుంచి 276 కు తగ్గించారు. జెడ్పిటిసిలు 25 నుంచి 27 కు పెరిగాయి. గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

Similar News

News March 26, 2025

‘పవన్ అన్న నువ్వు పిఠాపురం రా..!’

image

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని పిఠాపురం ప్రజలు ఎంతో ప్రేమతో గెలిపించుకున్నారు. ఆయన వచ్చాక పిఠాపురం దశ దిశ మారతాయని ఎంతో ఆత్రుతగా ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. కానీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో నెగ్గిన తర్వాత పవన్ పిఠాపురానికి రావడం చాలా తక్కువే. ఏదో కార్యక్రమంలో ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి, పవన్ అన్న నువ్వు పిఠాపురం రా అని ప్రజలు, అభిమానులు కోరుకుంటున్నారు.

News March 26, 2025

కార్వేటి నగరం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

బొలెరో వాహనం ఢీకొని కార్వేటి నగరం మండలానికి చెందిన యువకుడు మంగళవారం మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. కేపీ అగ్రహారానికి చెందిన రవి(26) తిరుపతిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బైకుపై వస్తుండగా వెదురుకుప్ప మండలం చిన్నపోడు చేను సమీపంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News March 26, 2025

NIRMAL: KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

error: Content is protected !!