News February 6, 2025

సర్పంచ్ ఎన్నికలు.. వికారాబాద్ జిల్లా పూర్తి వివరాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన వికారాబాద్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 4, మున్సిపాలిటీ‌లు 4 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-20, MPP-20, MPTC-227, గ్రామ పంచాయతీలు-594, వార్డులు 5058 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో‌ గ్రామాల్లో సందడి నెలకొంది.

Similar News

News December 11, 2025

అన్నమయ్య: అందాల పోటీల్లో మెరిసిన షేక్ రీమా.!

image

అన్నమయ్య జిల్లా T.సుండుపల్లికి చెందిన షేక్ షాహీనా, షేక్ జహుద్ బాషా దంపతుల కుమార్తె ‘షేక్ రీమా’ అందాల పోటీలో అద్భుత ప్రతిభను కనబరింది. జైపూర్‌లో నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో షేక్ రీమాకు “మిస్ ఈకో ఇంటర్నేషనల్ ఇండియా 2025” కిరీటం దక్కింది. 2026లో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతినిధిగా కూడా ఆమె పాల్గొనబోతున్నారు. మోడలింగ్‌, క్రీడలు, నృత్యంలో రీమా చూపుతున్న బహుముఖ ప్రతిభ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

News December 11, 2025

ఇంద్రకీలాద్రిపై పూల శోభ.. మైమరిపిస్తున్న అలంకరణ.!

image

ఇంద్రకీలాద్రిపై భవాని భక్తుల దీక్ష విరమణ మహోత్సవం గురువారం ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయాన్ని అధికారులు పూల అలంకరణతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. అత్యధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న భక్తులను ఈ అలంకరణ ఎంతగానో ఆకర్షిస్తూ, మైమరిపిస్తోంది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.

News December 11, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్

image

సీఎం చంద్రబాబు రేపు కపులుప్పాడలో కాగ్నిజెంట్ సహా ఐటీ పరిశ్రమల శంకుస్థాపనకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం భీమిలి–కపులుప్పాడ ప్రాంతాల్లో ఏర్పాట్లు పరిశీలించారు. రోడ్లు, భద్రత, పార్కింగ్ వంటి ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు. సీఎం పర్యటనలో లోపాలేమీ లేకుండా పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.