News June 14, 2024
సర్పంచ్ పదవికి గోండు శంకర్ రాజీనామా
శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట గ్రామపంచాయతీ సర్పంచ్ గోండు శంకర్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన గోండు శంకర్.. వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుపై గెలుపొందారు. దీంతో గోండు శంకర్ సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని డీపీఓ వెంకటేశ్వరరావుకు అందజేశానని ఆయన తెలిపారు.
Similar News
News September 19, 2024
శ్రీకాకుళం: 100 రోజుల TDP పాలనపై మీ కామెంట్?
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్..
News September 19, 2024
శ్రీకాకుళంలో ప్రేమ పేరుతో ఛీటింగ్
శ్రీకాకుళానికి చెందిన బాలికను ఒడిశాకు చెందిన యువకుడు మోసం చేశాడని పోలీసులను తెలిపింది. వారి వివరాలు.. బాలికకు రెండేళ్ల కిందట పెళ్లిలో కృష్ణ పరిచయమయ్యాడు. అతను పొక్లెయిన్ డ్రైవర్‌గా పైడిభీమవరంలో ఉండేవాడు. పరిచయమైనప్పటి నుంచి ప్రేమపేరిట తిరిగి, పెళ్లి చేసుకోమంటే తప్పించుకుంటున్నాడని తెలిపింది. దీనిపై శ్రీకాకుళం గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేసినట్లు ASI నారాయణ రావు బుధవారం తెలిపారు.
News September 19, 2024
శ్రీకాకుళం జిల్లాకు సీఎం చంద్రబాబు రాక
శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు విషయాన్ని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ‘ఇది మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిటి మండలం రాజపురం గ్రామానికి సీఎం రానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.