News February 1, 2025
సర్వర్ డౌన్.. పింఛన్ పంపిణీకి అంతరాయం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సర్వర్ సమస్య నెలకొంది. ఉదయం 6 గంటలకు పింఛన్ అందజేసేందుకు అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లగా కొంతసేపు సర్వర్ పనిచేసింది. అనంతరం ‘processing.. please wait’ అన్న ఎర్రర్ కోడ్ వస్తుండటంతో పంపిణీకి అంతరాయం ఏర్పడింది. ఫోన్లో ఆ యాప్ పనిచేస్తేనే పింఛన్ పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం.
Similar News
News November 23, 2025
వరంగల్: నగలతో ఉడాయించిన నిత్య పెళ్లికూతురు..!

పెళ్లయి 16 ఏళ్ల కూతురు ఉన్నా తనకింకా పెళ్లి కాలేదని నమ్మించింది. పలు మ్యాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్ పెట్టి అమాయకులను పెళ్లి చేసుకొని, అనంతరం అందినకాడికి డబ్బు, నగలతో ఉడాయిస్తున్న నిత్య పెళ్లికూతురు తాజాగా తన ప్రతాపాన్ని చూపించింది. వరంగల్(D) పర్వతగిరి(M)లోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని గత నెలలో పెళ్లిచేసుకుని ఇంట్లో ఉన్న నగలతో పదిరోజుల క్రితం పరారైనట్లు సమాచారం. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
News November 23, 2025
తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

తిరుపతి SP ఆఫీసులో సోమవారం జరగాల్సిన PGRS (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు SP సుబ్బరాయుడు తెలిపారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పంచమి తీర్థం (చక్రస్నానం) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని SP కోరారు.
News November 23, 2025
5వ బాలోత్సవం లోగో, బ్రోచర్ ఆవిష్కరణ: కలెక్టర్

మాంటిస్సోరి ఇండస్ పాఠశాలలో డిసెంబర్ 9, 10వ తేదీల్లో జరగనున్న 5వ బాలోత్సవం-2025 సన్నాహకాలు వేగంగా జరుగుతున్నాయి. బాలోత్సవానికి ప్రతీకగా రూపొందించిన అధికారిక లోగోను కలెక్టర్ డా.సిరి ఆవిష్కరించారు. బాలోత్సవం పిల్లల సృజనాత్మకత, ప్రతిభ, నాయకత్వ నైపుణ్యాలను వెలికితీయడానికి ముఖ్య వేదికగా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. అలాగే పోటీలు, విభాగాలు, తేదీలు, నిబంధనలు, నమోదు చేయాలన్నారు.


