News February 1, 2025
సర్వర్ డౌన్.. పింఛన్ పంపిణీకి అంతరాయం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సర్వర్ సమస్య నెలకొంది. ఉదయం 6 గంటలకు పింఛన్ అందజేసేందుకు అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లగా కొంతసేపు సర్వర్ పనిచేసింది. అనంతరం ‘processing.. please wait’ అన్న ఎర్రర్ కోడ్ వస్తుండటంతో పంపిణీకి అంతరాయం ఏర్పడింది. ఫోన్‌లో ఆ యాప్ పనిచేస్తేనే పింఛన్ పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం.
Similar News
News February 9, 2025
కిరణ్ రాయల్ వివాదానికి ఆ ఫొటోనే కారణమా?

తిరుపతి జనసేన ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ వివాదానికి రెండు రోజుల క్రితం ఆయన ప్రెస్ మీట్‌లో జగన్ 2.0 పోస్టర్‌ను రిలీజ్ చేయడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఫొటోతో మాజీ ముఖ్యమంత్రి హేళన చేయడం సహించలేని వైసీపీ నాయకులు కిరణ్ రాయల్ ఫోన్ గతంలో గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించారు. ఈ క్రమంలోనే ఆయన డేటాను అటు మీడియాకు ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
News February 9, 2025
కాళేశ్వర క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని.. అందుకు తగ్గట్లుగా నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, MLA గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. కాశీ, కేదార్‌నాథ్ కంటే ఈ క్షేత్రం ప్రాశస్త్యం కలదిగా పురాణాలు చెబుతున్నాయన్నారు.
News February 9, 2025
నవీపేట్: కెమెరాల పని తీరును పరిశీలించిన DIEO

రెండో దశ ప్రయోగ పరీక్షలు జరుగుతున్న నవీపేట్ మోడల్ జూనియర్ కళాశాల, నవోదయ జూనియర్ కళాశాలల్లో కెమెరాల పని తీరును నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవి కుమార్ ఆదివారం స్వయంగా పరిశీలించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కెమెరాలకు జియో ట్యాగింగ్ ఉందా లేదా అని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెమరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.