News August 18, 2024

సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి పొంగులేటి

image

సబ్బండవర్గాల రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని తెలిపారు. ఆయన కృషి, పోషించిన చారిత్రక పాత్రను ప్రతిఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News October 29, 2025

అత్యవసరమైతే 1077కు కాల్ చేయండి: ఖమ్మం కలెక్టర్

image

‘మొంథా’ తుపాను కారణంగా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, అత్యవసర సమయాల్లో ప్రజలు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కలెక్టర్ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. వరదలు, ప్రమాదాల సమయంలో వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1077 లేదా 90632 11298కు కాల్ చేయవచ్చని తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News October 29, 2025

ఖమ్మంలో పట్టు సడలుతున్న BRS..?!

image

ఖమ్మం జిల్లాలో BRS పట్టు సడలుతోంది. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితం కావడం పార్టీని కలవరపెడుతోంది. కమ్మ సామాజిక వర్గ నేతలకు పెద్దపీట వేసినప్పటికీ, ఆ వర్గం ఓటర్లు BRSను ఆదరించలేకపోయారనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తాతా మధు సైతం పార్టీకి బలం చేకూర్చలేకపోతున్నారనే ప్రచారం ఉంది. BCలకు అవకాశాలు కల్పిస్తే జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందనే టాక్‌ వినిపిస్తోంది.

News October 29, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఖమ్మం సీపీ

image

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దని, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటవద్దని, యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.