News November 12, 2024
సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్
ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే తీరుపై ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, సూపరవైజర్లతో సమావేశం నిర్వహించారు. ప్రత్యేక అధికారులు, ఆర్డీవోలు క్షేత్ర స్థాయిలో సర్వేను పరిశీలించాలని సూచించారు.
Similar News
News December 14, 2024
బెల్లంపల్లి: ఊయల మెడకు చుట్టుకొని మహిళ మృతి
కూతురును ఆడించేందుకు కట్టిన ఊయల తల్లి మెడకు చుట్టుకొని మహిళ మృతి చెందిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. 1టౌన్ SHO దేవయ్య వివరాల ప్రకారం.. బెల్లంపల్లిబస్తికి చెందిన నీరజ(42) తన కూతురు కోసం ఇంట్లో చీరతో ఊయల కట్టింది. గురువారం కూతురును ఒళ్లో కూర్చోపెట్టుకొని ఇద్దరు ఊయల ఊగుతూ ఆడించింది. కూతురును దించి కుమారుడికి ఊయల ఊగడం చూపిస్తుండగా ప్రమాదవశాత్తు చీర చుట్టుకుని ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు.
News December 14, 2024
నిర్మల్ : బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సీతక్క
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.
News December 13, 2024
ఉత్తమ విద్యే లక్ష్యంగా బాసర ఐఐఐటీని తీర్చిదిద్దుతాం :సీతక్క
ఉత్తమ విద్యే లక్ష్యంగా బాసర ఐఐఐటీని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆర్జీయూకేటీ బాసరను మంత్రి సందర్శించారు. క్యాంపస్‌కు చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైస్ ఛాన్స్‌లర్, విద్యార్థులు పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు.