News May 3, 2024
సర్వేపల్లిలో సత్తా చాటేదెవరో..?

సర్వేపల్లి రాజకీయం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా ఉంది. పాత ప్రత్యర్థులే తలపడుతున్నా కొత్త అంశాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభివృద్ధి చేశానని, తననే గెలిపించాలని కాకాణి కోరుతుండగా.. కంటైనర్ టెర్మినల్, అక్రమ మైనింగ్ తదితర అంశాలను సోమిరెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. టీడీపీ హయాంలో తాను చాలా పనులు చేశానని, అన్నీ గమనించి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. అంతిమంగా సత్తా చాటేదెవరో.?
Similar News
News January 15, 2026
కోవూరు : సంక్రాంతి అంటే మీకు తెలుసా..?

సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే అతి పవిత్రమైన రోజు. దీనితో ఉత్తరాయన పుణ్య కాలం ప్రారంభమై పంటకోత ముగిసి ప్రకృతికి, సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. ఈ పండుగను పెద్ద పండుగ అని అంటారు. దీనిని నువ్వులు, బెల్లంతో చేసే వంటకాలతో, రంగవల్లులతో పెద్దలకు నమస్కరించి కొత్త జీవితాన్ని స్వాగత్తిస్తూ కుటుంబసమేతంగా జరుపుకుంటారు. పండుగ విశిష్టత తెలిసినవారు కామెంట్ చేయండి.
News January 15, 2026
జిల్లాలోని 44 బహుళ ప్రయోజనకర గిడ్డంగులకు మహర్దశ

జిల్లాలోని 23 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్మించబడిన 44 బహుళ ప్రయోజనకర గిడ్డంగులకు మహర్దశ కలగనున్నట్లు డీడీఓ గుర్రప్ప తెలిపారు. బుధవారం ఢిల్లీకి చెందిన జాతీయ గిడ్డంగుల ప్రాధికార సంస్థ సహాయక సంచాలకులు సాయి ప్రదీప్‌తో ఆయన భేటీ అయ్యారు. నిర్మించిన గిడ్డంగులకు అక్రిడేషన్ పనులు వేగవంతంగా పూర్తయితే రైతుల పండించిన పంటల్లో గిడ్డంగులలో భద్రపరచుకోవచ్చన్నారు.