News September 10, 2024

సర్వేపల్లి: బాధితులకు పారిశ్రామికవేత్తల భారీ సాయం

image

వరద బాధితులను ఆదుకునేందుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలు భారీ సాయం ప్రకటించారు. రూ.2.97 కోట్ల విలువైన చెక్కులను సీఎం చంద్రబాబు నాయుడికు మంగళవారం అందజేశారు. జెమిని ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫాట్స్ కంపెనీ రూ.2 కోట్లు, ఎస్ఈఐఎల్ పవర్ ప్రాజెక్టు ప్రతినిధులు రూ.50 లక్షలు, పలు కంపెనీల ప్రతినిధులు కలిసి రూ.47 లక్షలను అందజేశారు. దాతలకు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News October 3, 2024

నెల్లూరు: కారు బోల్తా.. ఒకరు మృతి

image

కారు బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన సంఘటన వింజమూరు మండలం బొమ్మరాజుచెరువువద్ద గురువారం చోటుచేసుకుంది. కావలి నుంచి కడపకు వెళ్తున్న కారు బొమ్మరాజుచెరువు వద్ద కంకరగుట్ట ఎక్కి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కడపకు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు నుజ్జునజ్జయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 3, 2024

చండీ అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి

image

నెల్లూరులోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజైన గురువారం అమ్మవారు శ్రీచండీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

News October 3, 2024

సూళ్లూరుపేటలో వీఆర్వోపై ఇసుక మాఫియా దాడి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహిళా VROపై దాడి జరిగింది. సూళ్లూరుపేట(M) కాళంగి నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను ఇలుపూరు దగ్గర వీఆర్వో శ్రీదేవి పట్టుకున్నారు. దానిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మన్నారుపోలూరు వద్ద ట్రాక్టర్ యజమాని వీఆర్వోని అడ్డగించారు. ఆమెను బెదిరించి ఫోన్ పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఆమె వెంటనే ఎమ్మార్వోకు సమాచారం ఇవ్వగా.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.